17 June, 2026 | 10:45 PM

సార్ అవగాహన కోసం 2కే రన్ ప్రారంభం

17-06-2026 09:44 PM

అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

మహబూబ్ నగర్ అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ  కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన 2కే రన్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ బుధవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.