17 June, 2026 | 11:06 PM

పలు కుటుంబాలకు హరీశ్ రావు పరామర్శ

17-06-2026 09:39 PM

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించి,పలువురిని పరామర్శించారు.ఖాతా గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ వైస్ ఎంపీపీ దార మహిపాల్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి బీఆర్ఎస్ కార్యకర్త సోలిపురం యాదయ్య తండ్రి మల్లయ్యా ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అనంతరం పాలమాకుల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నరేష్ గౌడ్ తండ్రి తాళ్లపల్లి పర్శరాములు, కోనాయిపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ సర్పంచ్ నిమ్మ రాజిరెడ్డి నివాసాలకు హరీశ్ రావు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో మాజీ ఎంపీపీ జప శ్రీకాంత్ రెడ్డి, సారయ్య,సోమిరెడ్డి,రమేష్ గౌడ్,స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.