17 June, 2026 | 11:12 PM

ముత్తూట్ ఫైనాన్స్ నూతన శాఖను ప్రారంభం

17-06-2026 09:48 PM

ఎస్సై రమాదేవితో కలిసి ప్రారంభించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు 

సుజాతనగర్,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి సుజాతనగర్ లోని NSR కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన ముత్తూట్ ఫైనాన్స్ నూతన శాఖను స్థానిక ఎస్సై మాలోత్ రమాదేవి తో కలిసి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ముందుగా సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేసే విధంగా ముత్తూట్ ఫైనాన్స్ సేవలందించడం అభినందనీయమని  పేర్కొన్నారు. వ్యాపార, ఆర్థిక రంగాల అభివృద్ధికి ఇటువంటి సంస్థలు దోహదపడతాయని, కొత్త శాఖ ద్వారా ప్రజలకు రుణాలు, బంగారు ఆభరణాలపై రుణ సదుపాయాలు, ఇతర ఆర్థిక సేవలు అందుబాటులోకి  వస్తాయన్నారు.