24 June, 2026 | 2:26 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

సౌమ్య హంతకులకు కఠిన శిక్ష విధించాలి

06-02-2026 01:44 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): విధి నిర్వహణలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిని హేమశ్రీ అన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పిం చారు. సౌమ్య మృతికి సంతాపంగా గురువారం ఆదిలాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సౌమ్య సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సౌమ్య చిత్ర పటానికి పలువురు పుష్పాంజలి ఘటించి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐలు విజేందర్, గంగారెడ్డి, ఏం.డి అక్బర్ ఉస్సెన్, డిటిఎఫ్ సీఐ మురళీ కృష్ణ, టీఎన్జీఎస్ యూనియన్ లీడర్  అరుణ్ కుమార్, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ యూనియన్ సెక్రటరీ అరవింద్ పాల్గొన్నారు.