15 April, 2026 | 3:16 AM

సురంగల్‌లో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ

15-04-2026 01:00 AM

మొయినాబాద్, ఏప్రిల్ 14: రోడ్డు నియమాలను పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రీముఖి పిలుపునిచ్చారు. మంగళవారం సురంగల్ గ్రామంలో కౌన్సిలర్లు గడ్డం లక్ష్మి వెంకటరెడ్డి, కర్రోల్ల శ్రీధర్లతో కలిసి ఆమె రోడ్డు భద్రతపై అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించి, గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం చట్టరీత్యా నేరం.

యువతకు విజ్ఞప్తి చేశారు. అతివేగం ప్రాణాంతకమని, యువత వేగ పరిమితిని పాటించి కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.పాఠశాల ప్రాంతాల్లో తక్కువ వేగంతో వెళ్లాలని, వాహనాల మధ్య సరైన దూరం పాటించాలని సూచించారు. ‘ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను స్వచ్ఛందంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు అని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ అధికారులు అజయ్ కుమార్, సందీప్, ఎస్‌ఐ వెంకన్న, ట్రాన్స్కో ఏఓ సత్యం మరియు స్థానిక నాయకులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.