30 July, 2026 | 2:24 AM

వ్యాధినిరోధక టీకాలు వేయించండి

30-07-2026 01:38 AM

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు

మహమ్మదాబాద్ / హన్వాడ జూలై 29 : చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు అన్నారు. బుధవారం హన్వాడ, మహమ్మదాబాద్ మండలాల పరిధిలోని వెంకటరెడ్డి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పుట్టినప్పటినుండి పిల్లలకు జాతీయ వ్యాధినిరోధక టీకాల షెడ్యూల్ ప్రకారం క్రమము తప్పకుండ ప్రతి చిన్నారికి టీకాలు వేయాలని ఆదేశించారు.ఆదేశించారు.

అధిక రక్త పోటు, మధుమేహము, క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల చికిత్స వివరాలు సమీక్షించారు.ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని ప్రసవ తేది ఉన్న స్త్రీలలో సాధారణ కాన్పు కాగల వారి జాబితాను సిద్ధముగా ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంములో కాన్పులు అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకొని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమములో డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ డా. శశికాంత్,  స్టేట్ కన్సల్టెంట్ డా. అబ్దుల్ వసీ,ప్రోగ్రాం అధికారి డా. రాజు,ప్రోగ్రాం అధికారి శివకాంత్, హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు,నర్సింహా,సుభాష్ చంద్ర,డి పి సీ శివకుమార్,లు బుచ్చిబాబు, మహేష్, సీతారామ్, వైద్యాధికారులు, లు పాల్గొన్నారు.