30 July, 2026 | 3:45 AM

తాడ్వాయిలో వైభవంగా గురుపూజోత్సవం

30-07-2026 01:39 AM

భక్తిశ్రద్ధలతో అమ్మవారి పాదుకాపూజ...

తాడ్వాయి, జూలై 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో బుధవారం వ్యాస పౌర్ణమి, గురు పూర్ణిమ సందర్భంగా వైభవంగా గురుపూజోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ శబరిమత అమ్మవారికి ప్రత్యేక పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

అమ్మవారి పాదుకా పూజా కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో చేశారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్యన అమ్మవారికి పాదుకపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడ్వాయి మండలంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల మండలాలైన గాంధారి, లింగంపేట, మెదక్,నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి,బిక్కనూరు, కామారెడ్డి, సదాశివ నగర్ మండలా నుంచి భక్తులు తరలి వచ్చారు.

మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి పాదుకపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అంతకుముందు శ్రీ శబరిమాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు  అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ రాములు, ఆశ్రమ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.