08-09-2025 03:13:30 PM
హైదరాబాద్: రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) సోమవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీల ప్రతినిధులతో కమిషనర్ చర్చ నిర్వహించారు. ఈనెల 17న కొత్త ఓటర్ల నమోదు మార్పులకు అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని.. ఈనెల 30న తుది ఓటరు జాబితా ప్రాచరిస్తామని కమిషనర్ తెలిపారు. సమగ్ర ఓటరు జాబితా తయారీకి పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.