09-09-2025 12:17:25 AM
గత పాలకవర్గంలో రూ.4 కోట్లు స్వాహా?
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 8 (విజయక్రాంతి)బుధవారం జరగనున్న కేటీపీఎస్ బి టి పి ఎస్ వై టి పి ఎస్ ఎంప్లాయిస్ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు అతిరథులకు అవస్థలు తెచ్చిపెట్టనున్నట్లు తెలుస్తోంది. గ తంలో చక్రం తిప్పిన ఆ అతిరథులు తమ స త్తా చాటుకోవడానికి శాయశక్తు లా కృషి చే యాల్సిన పరిస్థితి ఎదురైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రధాన యూనియన్ లో ఉన్న వారంతా గత ఎన్నికల్లో తమ శక్తియుక్తులను, స్థానికమనే ఆయుధాన్ని, బహుమ తులను ఎరగా చూపి తమ సత్తా చాటి విజయాన్ని కైవశం చేసుకున్నారు. దీంతో వారు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఐదు సంవత్సరాల తమ పాలన కొనసాగించారు. దీంతో వారు తమకు నచ్చిన వారి కోసమే సొసైటీలో పని చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బయట వారికి లోన్ ప్రాసెసింగ్ చేయాలన్న తమకు అమ్యామ్యాలు ముట్ట చెప్పాల్సిందేనని బెరుకు లేకుండా చె ప్పి బహిరంగంగానే వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వా రిపై గత ఐదు సంవత్సరాల నుంచి వ్యతిరేకత చాప కింద నీరులా ప్రవహించినట్లు తెలుస్తోంది. అందుకేనేమో అది కాస్త ఎ న్నికలవేళ ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశాలు ఉన్నాయని యూనియన్ లో అంతర్గతంగా చర్చ సాగుతోంది.
దీంతో పా టు వారు యూనియన్ లో ఎన్నో సంవత్సరాలుగా సీనియార్టీ అర్హత ఉండి కూడా ఎ లాంటి పదవికి నోచుకోని వారు తమకు ఎన్నికల్లో నిల్చునే ఒక అవకాశం కూడా ఇ వ్వడం లేదని నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు తమ యూనియన్ కు చెందిన అభ్యర్థుల గెలుపు కోసం నిర్వహించే ప్రచారంలో అన్య మనస్కంగానే పా ల్గొంటున్నట్లుగా వినికిడి.
అదే కాక గత పాలనలో డైరెక్టర్లు సుమారు రూ.4 కోట్లు సొసైటీ నిధులను దారి మళ్లించి తమ సొంత ఖర్చులకు వినియోగించుకున్నారనే ఆరోపణలపై కేటీపీఎస్ కు చెందిన మరో యూ నియన్ సభ్యులు నగదు లావాదేవీల వివరాలను కోరుతూ ఉన్నతాధికారులకు సమాచా ర హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ విష యం సైతం ఆ నోట ఈ నోట కేటీపీఎస్ కా ర్మికులకు తెలియడంతో ఎవరికి వారే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇలా ఉంటే మరి కొందరు ఎటువంటి విద్యార్హత లేకుండా ఇ టువంటివారు సుమారు 120 కోట్ల లావాదేవీలు గల సొసైటీని ఎలా పాలిస్తారని ప్రశ్నలను లేవనెత్తుతుండటంతో విద్యావంతులైన ఏఈలు, ఏడీఏలు, డిఇలు సైతం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. అంతేకాక సొసైటీ సొమ్మును తమ ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని వార్షిక ఆడిట్ కు ముందు జమ చేయడం, ఆడిట్ పూర్తయిన వెంటనే ఆ నగదును మరల వాడుకుంటున్నారనే వాదన లు వినిపిస్తున్నాయి.
వాటితో పాటు రిజర్వుడు ఫండ్ ను సైతం వాడేశారనే గుసగు సలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అభ్యర్థులు నోట్ల కట్టలతో ఓట్లను కొనుగోలు చేసే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోం ది. ఇదిలా ఉంటే నూతనంగా పోటీలోకి వచ్చిన అభ్యర్థులు మాత్రం తమ గెలుపు పై పూర్తి భరోసా తో ఉన్నారు. ఒక్క అవకాశం ఇస్తే తాము సొసైటీని గాడిలో పెడతామని హామీలు ఇస్తున్నారు.
ప్రత్యర్ధులపై ఎలాంటి విమర్శలు చేయకుండా తమ పనిని తాము చేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే హంగు ఆర్భాటం లేకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బుధ వారం జరగనున్న ఎన్నికల్లో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకు గాను 3003 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే రోజు బి టి పి ఎస్ వైటిపిఎస్ పోలింగ్ స్టేషన్‌ల నుంచి బ్యాలెట్ లను పాల్వంచకు తరలించి పాల్వంచ డిఏవి పాఠశాల లోని పోలింగ్ కేంద్రంలో లెక్కింపు నిర్వహించనున్నారు.