08-09-2025 02:52:52 PM
హైదరాబాద్: నీటిపారుదల ఆర్ అండ్ బి అధికారులతో సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) సమీక్ష నిర్వహించారు. ఖమ్మం మున్నేరు కరకట్టల నిర్మాణం, కేబుల్ వంతెన నిర్మాణాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఏప్రిల్ చివరినాటికల్లా కేబుల్ వంతెన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశించారు. రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్ వంతెన నిర్మాణం.. అలాగే రూ.690 కోట్లతో మున్నేరు కరకట్టల నిర్మాణం జరుగుతుందని అన్నారు. మున్నేరు ముంపు బాధితులకు ఇబ్బంది లేకుండా కరకట్టలు నిర్మించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ శాఖలో ఏజెన్సీ సమన్వయంతో కరకట్టలో నిర్మించాలని.. మున్నేరుకు రెండు వైపులా ఏకాకాలంలో కరాకట్టలు నిర్మించాలని పేర్కొన్నారు.