ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని అత్తాపూర్ సర్కిల్ వద్ద రోడ్డును ఆక్రమించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆరాంఘర్ నుంచి డెయిరీ ఫామ్ చౌరస్తా వరకు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ(GHMC) కొరడా ఝులిపించింది. ఆరు జోన్లలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, షెడ్లను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలిగించారు. జాంబాగ్, గోషామహల్ వద్ద ఆక్రమణల తొలగింపును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్(GHMC CommissionerRV Karnan) పరిశీలించారు. సులభమైన ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్ధారించడానికి, ప్రజాప్రదేశాలను పరిరక్షించడానికి, జీహెచ్ఎంసీ ఈరోజు నగరవ్యాప్తంగా ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను చేపట్టిందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ డ్రైవ్‌ను సమర్థవంతంగా, క్రమపద్ధతిలో అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.




