10 May, 2026 | 6:58 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జీహెచ్‌ఎంసీ మేయర్

13-01-2025 07:56 PM

హైదరాబాద్, (విజయక్రాంతి): తెలుగు వారి సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింభించే పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ(GHMC Mayor Gadwal Vijayalakshmi), డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి(Deputy Mayor Mothe Srilatha Reddy), కమిషనర్ ఇలంబర్తిలు(GHMC Commissioner Ilambarithi) సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల మధ్య స్నేహభావం, ఐక్యత పెంపొందించేందుకు ప్రేరణ కలిగించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. మకర సంక్రాంతి రోజున సూర్యుని పూజించి, ప్రకృతి ప్రసాదాలకు కృతజ్ఞతలు తెలియ జేయడం పురాతన ఆచారాలలో ఒకటన్నారు. రైతుల కష్టానికి ప్రతిఫలంగా పంట కోతల పండుగ గా కూడా సంక్రాంతి ప్రసిద్ది చెందిందన్నారు. పండుగ వేళ ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించి, పర్యవరణానికి హానికరం కాని విధానాలను అనుసరించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డిలు సూచించారు. పండుగ సందర్భంగా పతంగులను ఎగురవేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహారించాలన్నారు. హైదరాబాద్ నగరం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడేలా నగర ప్రజలంతా సహకరించాలన్నారు.