27 June, 2026 | 7:31 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు

10-05-2026 05:21 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్  గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు నాగిరెడ్డిపేట మండలంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు గోపాల్పేట్ గ్రామంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రానికి సుమారు 8000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలిపారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపడానికి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోడీ సహకారం ద్వారానే జరుగుతుందని ప్రతి గ్రామ పంచాయతీలకు వస్తున్నటు వంటి నిధుల్లో 90% వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు తెలియజేయడం జరిగింది. నాగిరెడ్డిపేట మండలం నుండి సుమారు 100 మంది కార్యకర్తలు భారీ బహిరంగ సభకు తరలి వెళ్లినట్లు మండల అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు.