10 May, 2026 | 6:06 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట

10-05-2026 05:05 PM

తల సేమియా సొసైటీ అవార్డులు

అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించి నందుకు 16 అవార్డులు

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ ఫెడరేషన్కు అవార్డుల పంట దక్కింది. తల సేమియా వ్యాధిగ్రస్తులకు అత్యధికంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త సేకరణ చేసినందుకు కామారెడ్డి రక్తదాతల సమూహం  ప్రతినిధులకు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రతినిధులకు ఆదివారం హైదరాబాద్లో తల సేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో అవార్డులు అందజేశారు. తల సేమియా బాధిత చిన్నారుల కోసం అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు పదహారు అవార్డులను అందుకోవడం జరిగిందని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.

2023 నుంచి 35 పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఆరువేల యూనిట్లపై రక్తాన్ని సేకరించి తల సేమియా బాధిత జిల్లాలకు అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చిన్నారులకు కావాల్సిన రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరి నీ రక్తదాన శిబిరాలు బాధిత జిల్లాల కోసం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల సింహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్, ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ, జాలిగామ శ్రీకాంత్, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రం  చంద్రశేఖర్, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కస్వ వెంకటేష్, ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.

తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాదులో తలసేమియా బాధిత చిన్నారుల కోసం అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు గాను 16 అవార్డులను అందుకోవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2023 నుండి 35 పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 6000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి తల సేమియా బాధిత చిన్నారులకు అందజేయడం జరిగింది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో చిన్నారులకు కావలసిన రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను బాధిత చిన్నారుల కోసం నిర్వహిస్తామని అన్నారు.