బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి
మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): హైదరాబాద్ లో మైనర్ బాలిక ను నమ్మించి మోసం చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ను వెంటనే అరెస్ట్ చేయాలి. వేధింపులకు గురి అయినటువంటి యువతి కి ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేయాలని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. ఆదివారం బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఉన్న చాటు మాటు రాజకీయ సంబంధంతో కేంద్రమంత్రి బండి సంజయ్ కేసును నిరుగార్చాలని చూస్తున్నారని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని. నేరస్తున్ని చట్ట పరిధిలో శిక్షించాలని డిమాండు చేస్తున్నాం.. మైనర్ బాలిక కు న్యాయం జరిగే వరకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు సోమేష్. రమేష్. నాగమల్లు. వెంకటేష్ లతీబ్. గోపగాని వెంకన్న. చింతకుంట్ల సురేష్. కొల్లూరి మహేందర్. ఆకారపు భాస్కర్ పాల్గొన్నారు..






