16-12-2025 10:38:03 AM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో వార్డుల విభజనపై చర్చించనున్నారు. కార్పొరేటర్లు వార్డుల డీలిమిటేషన్ పై సభలో అభ్యంతరాలు తెలపనున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు డీలిమిటేషన్ సలహాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ కు పార్టీల నేతలు వినతిపత్రం ఇచ్చారు. వార్డుల విభజన ఏ ప్రాతిపదికన చేశారో తెలియట్లేదని కార్పొరేటర్లు ప్రశ్నించారు. వార్డుల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని నేతలు తెలిపారు.