పెద్దమల్లారెడ్డిలో ఉపాధిహామీ పనుల పరిశీలన
25-02-2026 12:30 PM
భిక్కనూర్, ఫిబ్రవరి25,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఎంపిడివో రాజ్ కిరణ్ రెడ్డి ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న పనుల పురోగతి, కూలీల హాజరు నమోదు, పనుల నాణ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం కూలీలకు నిరంతరం పనులు కల్పించి, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఉపాధిహామీ పథకం గ్రామాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల సంరక్షణ, నీటి సదుపాయాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్, ఉపాధిహామీ అధికారులు పాల్గొన్నారు.




