2 August, 2026 | 11:40 PM

బెల్లి లలితకు ఘననివాళి

27-05-2024 02:02 AM

యాదాద్రి భువనగిరి, మే 26  (విజయక్రాంతి) : తెలంగాణ సాధన కోసం తన పాటే ఆయుధంగా పోరాడిన వీరవనిత బెల్లి లలిత అని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం ఆమె 25వ వర్ధంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో మలి దశ ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు ఆమెకు నివాళులు అర్పి ంచారు. సారా వ్యతిరేక, వ్యభిచార నిర్మూలన వంటి పోరాటాలతో పాటు నీళ్లు, నిధులు, నియామకాల కోసం అలుపెరుగని పోరాటాలు చేసిందని కొనియాడారు. ఆమె సమాధి వద్ద, అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు సమర్పించి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యులు బీరు మల్లయ్య, టీపీసీసీ కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, టీపీసీసీ ప్రతినిధి తంగెళ్లపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.