calender_icon.png 24 October, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనుల పండువగా గిరి ప్రదక్షిణ

02-11-2024 02:32:12 AM

లక్ష్మీనరసింహ నామస్మరణతో మారుమోగిన యాదాద్రి

యాదాద్రిభువనగిరి, నవంబర్ 1 (విజయక్రాంతి): దుష్ట శిక్షణ..శిష్టరక్షణకు శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఉత్కృష్టమైన నృసింహుడి ఆవిర్భావ తిరునక్షత్రం స్వాతి వేడుకలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దీపావళి వరుస సెలవులతో పాటు స్వాతి పుణ్యతిథి, గిరిప్రదక్షిణ నేపథ్యంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఎం.హనుమంతరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అదే విధంగా  ఆయన గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.

అలాగే కొండపై కొలువై ఉన్న లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింయాకె. అమ్మవారి ఉత్సవ మూర్తుల ఎదుట ఆలయ ఖజానాలోని వజ్ర, స్వర్ణ, వెండి ఆభరణాలతో పాటు నగదును పెట్టి, పాంచ రాత్రగమ శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు.