ఆ 10 మంది ఎమ్మెల్యేలకు భారీ ఊరట
- పార్టీ ఫిరాయింపు కేసును ముగించిన సుప్రీంకోర్టు
- విచారణ అవసరం లేదన్న సర్వోన్నత న్యాయస్థానం
- అన్ని పిటిషన్లను స్పీకర్ పరిష్కరించారన్న న్యాయవాది అభిషేక్ సింఘ్వీ
న్యూఢిల్లీ, మార్చి 12: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్‌పై విచారణ జరపా ల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు భారీ ఊరట ల భించింది.
జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించగా.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఈ అంశంపై తుది నిర్ణ యం తీసుకున్నట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు వెల్లడించారు. సదరు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చిచెప్పినట్లు ఆయన తెలిపా రు. సింఘ్వీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... స్పీకర్ ఇచ్చిన తీర్పు కాపీలను రెండు రోజుల్లోగా ఫిర్యాదుదారులకు అందజేయాలని ఆదేశించింది.
స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించిన నేపథ్యంలో, ఈ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీఆర్‌ఎస్ స్పీకర్, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపి నిర్ణయం తీసు కోవాలని స్పీకర్‌కు సుప్రీంకోర్టు గడువు విధించడంతో.. ఇటీవలె స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెల్లడించారు.
అయితే 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడంతో.. ఆ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ.. తాజాగా మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు దాఖ లు చేసిన పిటిషన్లను సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ నేపథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తుది తీర్పు ఇచ్చింది.
సుప్రీంలో ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో స్పీకర్ తరఫున న్యాయ వాది చేసిన వాదనలతో సుప్రీంకోర్టు సం తృప్తి చెందింది. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా రని తేల్చి చెప్పింది.
ఇక ఈ పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకో ర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచార ణ ముగిసినట్లు వెల్లడించింది. అదే సమయంలో తెలంగాణ స్పీకర్ తన తీర్పు కాపీల ను.. ఫిర్యాదుదారులకు రెండు రోజుల్లో ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.




