రేపు నాటు కోళ్ల పెంపకంపై శిక్షణ
ఘట్‌కేసర్, మార్చి 12 (విజయక్రాంతి) : గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపా ధికి దోహదపడే దేశీ నాటుకోళ్ల పెంపకంపై ఈ నెల 14న (శనివారం) ప్రత్యేక శిక్షణ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్గానిక్ రైతు పిట్టల శ్రీశైలం తెలిపారు. ఘట్ కేసర్ సర్కిల్ పరిధి అంకుషాపూర్ లోని పిట్టల ఆర్గానిక్ ఫామ్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందించే వ్యవసాయ అనుబంధ రంగాలలో దేశీ నాటుకోళ్ల పెంపకం ఒక్క అవకాశమని పేర్కొన్నారు.
పులి సంపత్ కుమార్ (వరంగల్) శిక్షణను ఇస్తారని రైతులు, మహిళా సంఘాలు, యువత ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో దేశీ నాటుకోళ్ల జాతుల ఎంపిక, బ్రూడింగ్ దశ నుండి మార్కెట్ వరకు నిర్వహణ విధానాలు, సహజ ఆహారం తయారీ, సహజ మందుల వినియోగం, వ్యాధి నివారణ చర్యలు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే పద్ధతులు వంటి అంశా లపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
మార్కెటింగ్ అవకాశాలు, నేరుగా వినియోగ దారులకు విక్రయ విధానాలు, లాభనష్టాల అంచనా వంటి అంశాలను కూడ వివరించనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణకు హాజరయ్యే రైతులకు ప్రాక్టికల్ డెమెతో పాటు అనుభవ పూర్వక సూచనలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రయోజనం పొందాలని శ్రీశైలం కోరారు. రిజిస్ట్రేషన్ కోసం 9959996597 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.




