13 March, 2026 | 4:39 AM

పశు వధశాలకు అధికారుల అండ!

13-03-2026 12:29 AM

ఆమ్యామ్యాలకు జీ హుజూర్... 

అనుమతులు లేకుండానే నిర్మాణాలు 

మరో అల్లానాగా మారనున్న మల్గీ 

జహీరాబాద్, మార్చి 12: జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో కొనసాగుతున్న పశు వధశాలకు అధికారుల అండ ఉండడంతో వారి పనులు మూడు పు వ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. అధికారుల అండదండలు మెండుగా ఉండడంతో ఆ కంపెనీ వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఈ కంపెనీని ఫుడ్ ప్రాసెసిం గ్ కంపెనీ పేరుతో వెలసినప్పటికీ దానిలో మాత్రం పశువులను వధించి వాటి మాంసా న్ని ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు.

గ్రామ పంచాయతీకి ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. మల్గీ గ్రామ శివారులో నిర్మా ణాలు సాగుతున్నా గ్రామ కార్యదర్శి గానీ, రె వెన్యూ సిబ్బంది, సర్పంచ్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే నిధు లు రావడం లేదు. కేవలం అధికారులకు ఆ కంపెనీ యాజమాన్యం ఇచ్చే ఆమ్యామ్యాలు పుచ్చుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

గ్రామ కార్యదర్శి మాత్రం ఏకంగా గత రెండు సంవత్సరాల నుండి కంపెనీ నడవడం లేద ని, దానికి తాళం వేసి ఉంటుందని చెప్పడం గమనార్హం. మల్గీ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కా భ వనం నిర్మిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. కొందరు గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిని, రెవె న్యూ అధికారులను సంప్రదిస్తే ఎలాంటి స మాధానం చెప్పడం లేదన్నారు.

ఈ కంపెనీ యాజమాన్యం బెదిరింపులకు, దాడులకు పాల్పడుతూ కంపెనీ పరిసర ప్రాంతాలకు ఎవరినీ రాకుండా జాగ్రత్త పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కంపెనీ య జమాన్యం గత 20 సంవత్సరాల నుండి రే కుల షెడ్డులో నడిపిస్తూ ప్రస్తుతం ఆ కంపెనీ పక్కా భవనంగా విస్తరించేందుకు నిర్మాణ పనులు చేపడుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కంపెనీ యాజమాన్యానికి త లొగ్గి పంచాయతీ అధికారులు నిర్మాణానికి ఎన్వోసీ ఇచ్చినట్లు తెలిసింది.

గ్రామ కార్యద ర్శి పంచాయతీ తీర్మానం లేకుండా ఎన్‌ఓసి ఇవ్వడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ రావును వివరణ కోరగా కంపె నీని పరిశీలించేందుకు వెళ్లేందుకు తమకు స మయం దొరకడం లేదని చెప్పడం గమనా ర్హం. ఈ కంపెనీ కాలుష్యం వల్ల పరిసర గ్రా మాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ నిర్మాణం పనులు నిలిపివేయాలని గ్రామస్తులు ఐదారేళ్ళుగా అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని వా పోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కం పెనీని మూసివేయాలని కోరుతున్నారు.