1 July, 2026 | 3:22 PM

నాచారంలో బాలిక అదృశ్యం

05-05-2026 02:10 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని నాచారం గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఎస్.ఐ. సాయికిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాచారం గ్రామానికి చెందిన పెంబుల దుర్గాభవాని (17), ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాసి ఇంటి వద్దనే వుంటోందని, ఈ నెల 4వ తారీఖున రాత్రి సుమారు 1.00 గంట సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి రాకపోవడంతో దుర్గాభవాని తల్లి పెంబుల రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. సాయికిషోర్ రెడ్డి తెలిపారు.