20 August, 2026 | 9:04 AM

ఆకర్షణీయంగా రైతు బజార్‌ ఏర్పాటు

20-08-2026 08:28 AM

వినియోగానికి రైతు బజార్ సర్వం సిద్ధం 

సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ దుర్గమ్మ 

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన కూరగాయలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కూరగాయలు పండించే స్థానిక రైతులు నేరుగా వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం కల్పించేందుకు రైతు బజార్‌ను ఏర్పాటు చేశామని సర్పంచ్ దుర్గమ్మ పేర్కొన్నారు.రైతు బజార్ ను వ్యవసాయానికి,పల్లె ప్రజల జీవన విధివిధానాలకు సంబంధించిన చిత్రాలతో అలంకారప్రాయంగా రంగులతో తీర్చిదిద్దడం జరిగిందని ప్రస్తుతం కూరగాయల అమ్మకాలకు సిద్ధంగా ఉందన్నారు.

ఇక పై గ్రామంలో కూరగాయలు పండించే రైతులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ పంటలను నేరుగా ప్రజలకు విక్రయించుకోవచ్చని వారు తెలిపారు.ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రైతులు తమ కూరగాయలను రైతు బజార్‌లో విక్రయించుకునే అన్ని సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.గ్రామ రైతులకు,ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన సర్పంచ్ దుర్గమ్మతో పాటు పాలకవర్గ సభ్యులను గ్రామ ప్రజలు అభినందించారు. రైతులకు మంచి ధర, ప్రజలకు తాజా కూరగాయలు అందేలా రైతు బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.