ఆపదలో అండగా నిలిచిన ఎన్నారై.
05-05-2026 02:12 PM
- మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని పల్లిమక్త గ్రామానికి చెందిన నాయిని నరహరి ఇటీవల వేములవాడ నందికామాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి ప్రముఖ ఎన్నారై అంబోజ వెంకటేష్ చేయూతనందించారు. సుద్దాల గ్రామానికి చెందిన ఎన్నారై అంబోజ వెంకటేష్ మృతుని భార్య రేణుకకు రూ.5 వేల నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుటుంబ పెద్దను కోల్పోయిన ఈ క్లిష్ట సమయంలో రేణుకకు ఎల్లవేళలా అండగా ఉంటామని, అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాసంపల్లి శ్రీనివాస్, నాయకులు ఎం. శ్రీనివాస్, మాసం సుమన్, మాసం బాబు, మాసం సందీప్, కారోబార్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






