షావుకారు జానకికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
చెన్నై: అలనాటి రంగస్థల, సినీ కథానాయిక షావుకారు జానకికి(Actress Sowcar Janaki) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షావుకారు జానకి శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు. జానకి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. జానకి 1931 సంవత్సరం డిసెంబరు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. జానకి వయసు 95 ఏళ్ల.
ఆమె 1950లో షావుకారు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. నటి షావుకారు జానకి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇందులో సుమారు 2 వందలకి పైగా కథానాయిక పాత్రలు పోషించింది. ఆమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా చేసింది. ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా సినిమా నటి. భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.






