calender_icon.png 5 September, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికా భద్రతా కార్యక్రమాలు భేష్

04-09-2025 12:00:00 AM

ఉగాండా ప్రతినిధుల కితాబు

కరీంనగర్, సెప్టెంబర్03(విజయక్రాంతి): బాలికల భద్రత, విద్య, అభివృద్ధి, జీవన నైపుణ్యం కోసం జిల్లాలో చేపడుతున్న వాయిస్ ఫర్ గరల్స్, స్నేహిత వంటి కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఉగాండా దేశపు ‘ గర్ల్ ఆఫ్ ఉగాండా‘ సంస్థ ప్రతినిధుల బృం దం బుధవారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించింది. బాల బాలికలతో మమేకమై జిల్లా యంత్రాంగం నిర్వ హిస్తున్న కార్యక్రమాలపై కితాబు ఇచ్చింది. 

హనుమాన్ నగర్ లోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, బొమ్మకల్ లోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో బాలికల పరిరక్షణకు స్నేహిత క్లబ్, వాయిస్ ఫర్ గరల్స్ కార్యక్రమం ద్వారా చేపట్టిన అవగాహన కార్యక్రమాలను విశ్లేషించారు. అనం తరం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పమేలా స త్పతితో ఈ బృందం సమావేశమైంది.

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో చేపట్టిన వాయి స్ ఫర్ గరల్స్, స్నేహిత కార్యక్రమాల గురించి వివరించారు. మహిళ, శిశు సంక్షేమం, పో లీస్, ఎక్సైజ్ వంటి వివిధ శాఖల అధికారులతో ప్రతి పాఠశాలలో స్నేహిత కార్యక్రమా లు నిర్వహించామనితెలిపారు.