calender_icon.png 5 September, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొన్న మాట ఇచ్చాడు నేడు ఇంటికి వచ్చాడు

04-09-2025 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 03 (విజయక్రాంతి): జిల్లాలో వేములవాడ అర్బన్ మం డలం నాంపల్లి గ్రామంఅభిమాని ఇంటికి వెళ్లి తేనేటి విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ తన అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్. వేములవాడ ఎమ్మెల్యే గా గెలువాలని వేములవాడ పట్టణం నాంపల్లి కి చెందిన కదురు బాలయ్య గత ఎన్నికల్లో తను నిత్యం అమ్మే కూరగాయల బండిని తన ప్రచార సాధనంగా చేసుకొని మైక్ లో జననేత ఆది శీనన్నను గెలిపించండి అంటూ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

ప్రజా ఆశీర్వాదం తో ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వ విప్ గా నియామకం కబడి నిత్యం ప్రజల మధ్య ఉంటున్న విషయం తెలిసిందేనాంపల్లి,  సాల రామన్న పల్లిలోని కదురు బాలయ్య ఇంటికి వెళ్లి దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి తేనేటి విందులో పాల్గొన్నారు,తన గెలుపులో భాగస్వామ్యం కావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.