13 April, 2026 | 2:38 AM

అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదు

13-04-2026 01:26 AM
  1. సిద్దిపేట పారిశ్రామికీకరణకు మా పూర్తి సహకారం

పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

నర్మెటలో రూ.210 కోట్లతో బయో గ్యాస్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

కార్యక్రమంలో కాసేపు ఉద్రిక్తత.. ఆపై సద్దుమణిగిన వివాదం

నంగునూరు, ఏప్రిల్ 12: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఎటువంటి బేషజాలు లేవ ని, సిద్దిపేట ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ఎక్కడ అవకాశం ఉన్నా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూ రు మండలం నర్మేట పారిశ్రామిక ప్రాం తంలో మొదటి దశలో రూ.210 కోట్లతో ఏర్పాటు చేయనున్న జూల్ బయో ఫ్యూయ ల్స్ కాంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్‌కు ఆదివారం రాజ్యసభసభ్యులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ పార్లమెంటరీ స్టాం డింగ్ కమిటీ చైర్మన్ భువనేశ్వర్ కలిత, పర్యావరణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మ న్ ఎన్‌కే ప్రేమచంద్రన్, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో కలిసి శ్రీధర్‌బాబు శంకుస్థాపనచేశా రు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి విషయం లో తమ ప్రభుత్వానికి ఎటువంటి పట్టింపులు, బేషజాలు లేవన్నారు. గత ప్రభుత్వం భూసేకరణ చేసినా, అభివృద్ధికి పునాదులు వేసినా.. వాటిని సద్వినియోగం చేసుకుం టూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కడ అనుకూలత ఉన్నా, స్థానిక యువతకు ఉపాధి లభించేలా తాము అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణను 2034 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడ మే లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ బ యోగ్యాస్ పరిశ్రమ కాలుష్యరహితమైనదని, గడ్డి వంటి వ్యర్థాలతో ఇంధనం ఉత్పత్తి చే యడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోందని చెప్పారు.

కాళేశ్వరం జలాలతో పారిశ్రామిక విప్లవం: హరీశ్‌రావు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడం వల్లే నేడు సిద్దిపేటలో వ్యవసాయంతోపాటు పారిశ్రామిక విప్లవం సాధ్యమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. నాడు కన్న కలలు నేడు నిజమవుతున్నాయ ని, పామాయిల్ ఫ్యాక్టరీ తర్వాత ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్ రావడం సంతోషకరమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా 500 మందికి ఉపాధి లభిస్తుందని, ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా సహకరిం చాలని కోరారు.

మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతూ.. తెలంగాణలో ఆంధ్ర పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వారు పరిశ్రమలు స్థాపిం చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సహకరించాలని  కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాయపాటి, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్, ఎస్‌వీ పిళ్ళైతోపాటు స్థానిక సర్పంచ్ శనిగరం స్వాతి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి పాల్గొన్నారు.