ఆధారాలు చూపే అవకాశమివ్వండి
- కావూరిహిల్స్ ఇండ్లకు నోటీసులపై హైకోర్టు
- నోటీసులను షోకాజ్‌లుగా పరిగణించేందుకు అనుమతి
- ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట ప్రాంతంతోపాటు కావూరిహిల్స్ లేఔట్‌లో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలకు హైడ్రా జారీచేసిన నోటీసులకు ఆ నిర్మాణదారులు చట్టబద్ధమైన ఆధారాలు సమర్పించడానికి అవకా శం ఇవ్వాలని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎ ల్ ప్రాంతంలోని ఆక్రమణలను 30 రోజుల్లోగా తొలగించాలని వాల్టా చట్టంలోని సెక్షన్ 23 కింద జారీచేసిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని ఆదేశించింది.
ఈ నోటీసులపై పిటిషనర్లు సమ ర్పించిన ఆధారాలను పరిశీలిలంచాక చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సూచించింది. గుట్టల బేగంపేటలో ప్లాటు కొనుగోలు చేసి నిర్మించుకున్న ఇళ్లను తొలగించాలని డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో 7 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గు రువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తర ఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గుట్టల బేగంపేటలో 58.08 ఎకరాల్లో 280 ప్లాట్లతో వేసిన లేఔట్‌లో 1998లో ప్లాటు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
అన్ని అనుమతులతో ఇళ్లను, అపార్ట్‌మెంట్లను నిర్మిం చుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, సమాచారం లేకుండా తొలగించాలని నోటీసులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించారు. అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎఫ్‌టీఎల్ పరి ధిలోని నిర్మాణాలను తొలగించాలని ఇచ్చిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణిస్తామని, నిర్దిష్ట గడువులోగా ఆధారాలు సమర్పించడానికి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.
దీంతో ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఎఫ్‌టీఎల్ ప్రాం తంలోని నిర్మాణాలను తొలగించాలన్నదే నోటీసుల్లో ప్రధానంగా ఉందని, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తమ వాదన వినకుండా కూల్చివేత నోటీసులు ఇవ్వడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్లు జారీ చేసిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణించి అధికారులకు అన్ని ఆధారాలను సమర్పించి వివరణ ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తరువాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను ముగించింది.
మెడికల్ స్థానికత వివాదంపై తీర్పు రిజర్వు
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మి షన్లకు సంబంధించి స్థానికత వివాదంపై హైకోర్టులో గత మూడు రోజులుగా కొనసాగిన వాదనలు గురువారం ముగిశాయి. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఎవరైనా రాతపూర్వక వాదనలు సమర్పించాలని భావిస్తే శుక్రవారంలోగా అందజేయాలని ఆదేశించింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలను సవరిస్తూ రూల్ 3ఏను చేర్చుతూ ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన జీవో 33ను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బీ మయూర్‌రెడ్డి, డీవీ సీతారాంమూర్తి తదితరులు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన సవరణ వల్ల స్థానికులకే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఇతర రాష్ట్రాల వారితోపాటు భారతీయ మూలాలున్న ప్రవాస భారతీయులు ఇక్కడ 4 ఏళ్లు చదువుకుంటే 85 శాతం స్థానిక కోటా కింద అవకాశం దక్కించుకుంటారని చెప్పారు. దీనివల్ల తెలంగాణలో పుట్టిపెరిగిన వారికి నష్టం వాటిల్లుతుందని అన్నారు.
స్థానిక కోటా ఇక్కడ నివాసం ఉన్నవాళ్లకే అడుగుతున్నామని, చదువుకున్నవారు అన్నదానిపై అడగటంలేదని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూ డదన్న ఉద్దేశంతోనే ఈ జీవో తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం యూనివర్సిటీల పరిధిలోని స్థానిక కోటా రద్దయినందున నిబం ధనల సవరణ తప్పనిసరి అయ్యిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. తీర్పు వెలువరించేలోగా అభ్యర్థులు సమర్పించే దరఖాస్తులను స్థానికత వివాదంపై తిరస్కరించకుండా స్వీకరించాలని కాళోజీ యూనివర్సిటీకి సూచించించింది.






