27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

మందు మానేయ్ నాన్నా..!

04-06-2026 12:00 AM

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజాచిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ దీన్ని యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ కాగా, బేబీ నక్షత్ర.. రవితేజ కూతురు పాత్రలో కనిపించనుంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిరా, స్వాసిక ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు.

కమర్షియల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ రూపొందిస్తున్న సినిమా అని గ్లింప్స్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ పేరుతో విడుదల చేసిన ఈ ప్రత్యేక వీడియోలో తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో అందంగా చూపించారు.

ముఖ్యంగా ఇందులో ‘మందు మానేయ్ నాన్నా..’ అంటూ బేబి నక్షత్ర చెప్పిన డైలాగ్ హృదయాలను తాకేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.