సర్కారు బాయి.. జాతీయ అవార్డు స్థాయి సినిమా
తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీ టి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘సర్కారు బాయి’. శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తున్నారు. తుమ్మల ప్రఫు ల్ రాంరెడ్డి నిర్మాత. ఇందులో బాహుబలి ప్రభాకర్, వివరెడ్డి, నాగ మహేశ్, దిల్ రమేశ్, చలాకీ చంటి, చిట్టిబాబు, శివానిరెడ్డి, నుపూర్ ముఖర్జీ, అతిథి ముఖ్య పాత్రలు పోషిస్తు న్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రము ఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్యఅతిథులుగా హాజ రై ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. “తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అంశాలతో కూడిన కథలంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి కథలో భాగస్వామి కావడం గర్వంగా ఉంది” అన్నారు. ‘ఈ కథ విన్న వెంటనే ఇది జాతీయ అవా ర్డు స్థాయి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. ప్రేక్షకులందరూ ఈ చిత్రానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాన’ని హీరోయిన్ వర్షిక చెప్పింది.
దర్శకుడు లారా మాట్లాడుతూ.. “చరిత్రలో మరుగున పడిపోయిన ఓ భావోద్వేగ కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ‘సర్కా రు బాయి’ వద్ద అణగారిన వర్గాలకు నీళ్లు ఇవ్వకుండా జరిగిన అన్యాయాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటి గాథ ఈ చిత్రానికి మూలకథ.
1985లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు, కుల వివక్ష, సామాజిక అసమానతలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం” అని తెలిపారు. నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ.. “త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభి స్తాం. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశా లు ఉన్నాయి” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులతోపాటు నటులు చిట్టిబాబు, మోహన్ బైరాగి, కో -ప్రొడ్యూసర్ జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడారు.






