17 March, 2026 | 2:27 AM

వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ

22-07-2024 02:12 AM

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆదివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ వైభవంగా సాగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాఢ వీధుల్లో విహరిస్తూ వేలాదిగా తరలివచ్చిన భక్తులను కటాక్షించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చినజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.