calender_icon.png 6 December, 2024 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీవారి ముత్యపు పందిరిసేవ

07-10-2024 12:30:09 AM

కొనసాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు 

పందిరిసేవను తిలకించేందుకు భారీగా వచ్చిన భక్తులు

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాం తి): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్స వాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ యోగానరసింహుడి అవ తారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

వాహ నం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాల మధ్య వాహనసేవ కొనసాగింది. అంతకు ముందు ఉదయం 10 గంటలకు సింహ వాహనసేవ నిర్వహించారు. వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తులకు తరలొచ్చారు. ముత్యాలను చంద్రునికి ప్రతీకగా భావిస్తారు.

శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడ లో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో ఉంది. ఆదిశేషుడి పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని పురా ణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుడి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందని భక్తుల నమ్మకం.

ఉదయం జరిగిన సింహవాహన సేవలో కేంద్ర సహాయ మం త్రి శ్రీనివాసవర్మ, హైకోర్టు జడ్జి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు సీఈవో వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.