ఏఆర్ కానిస్టేబుల్ హత్య కేసు చేదించిన ఉప్పల్ పోలీసులు
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ చిలక నగర్ లోని ఏ ఆర్ కానిస్టేబుల్ హత్య కేసును 6 గంటల వ్యవధిలోనే ఉప్పల్ పోలీసులు చేదించారు హత్యకు పాల్పడిన ఇద్దరినింతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఉప్పల్ జోన్ డిసిపి సురేష్ కుమార్ తెలిపిన ప్రకారం... చిల్కానగర్ చెందిన సుధీర్ కుమార్ (38) హైదరాబాద్ సిటీ పోలీస్ సిడబ్ల్యుసి ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఉప్పల్ చెందిన సంతోష్ (28 ) వృత్తి రీత్యా రాపిడో డ్రైవర్ సుధీర్ సంతోష్ దగ్గరి స్నేహితులు వీరిద్దరూ తరచూ కలిసి మద్యం సేవించేవారు. ఇటీవల కాలంలో సుధీర్ బావ గృహప్రవేశానికి సంతోష్ ను ఆహ్వానించారు.
సంతోష్ వ్యక్తిగత కారణాలవల్ల సుధీర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫంక్షన్ కూడా హాజరు కాకపోవడంతో సుధీర్ సంతోష్ పై కోపం పెంచుకున్నాడు. అప్పటినుండి సుదీర్ సంతోష్ ఫోన్లో వాదపవాదాలకు దిగేవారు. దీంతో ఇరువురికి ఫోన్లలో ఘర్షణ జరిగింది. సంతోష్ సుధీర్ కి ఫోన్ చేసి మాట్లాడుకుందామని చిలకా నగర్ గ్రౌండ్ వద్దకి రమ్మన్నాడు. దీంతో సుధీర్ తన స్నేహితుడైన ఇమ్రాన్ తో కలిసి అక్కడికి వెళ్ళాడు. మద్య మత్తులో ఉన్న వీరు ఒకరిపై ఒకరు అసభ్య పదజాలం ఉపయోగించుకుంటూ గొడవకు దిగారు. దీంతో ఒకసారిగా సంతోష్ చాకుతో సుధీర్ పై దాడికి దిగాడు.
సుధీర్ పారిపోతున్నప్పటికీ సంతోష్ తన వెంబట ఉన్న తరుణ్ ఇద్దరు వెంబడిస్తూ సుధీర్ ని అతి దారుణంగా హతమార్చారు. రోడ్డుపై రక్తం మడుగులో వికటజీవి ఉన్న సుదీర్ ని చూసిన స్థానికులు సుధీర్ బావ అయిన కాన్పూర్ శ్రీకాంత్ సమాచారం అందించారు. శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకునే సుధీర్ మృతి చెందాడు. దీంతో తన బామ్మర్ది సుదీర్ ని హత్యకు పాల్పడిన సంతోష్ తరుణులపై శ్రీకాంత్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి హత్యకు ఉపయోగించిన కత్తి మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించారు. 6 గంటల వ్యవధిలోనే హత్య కేసు చేదించిన ఉప్పల పోలీసులను డిసిపి సురేష్ కుమార్ అభినందించారు.




