4 July, 2026 | 6:34 AM

కాజీపేట బైపాస్, సికింద్రాబాద్ స్టేషన్‌లో జీఎం తనిఖీలు

28-06-2024 01:54 AM

పనుల పురోభివృద్ధిపై ఆరా

హైదరాబాద్,  జూన్ 27 (విజయక్రాంతి): కాజీపేట బైపాస్ లైన్ పనులతో పాటు సికింద్రాబాద్ కాజీపేట సెక్షన్‌ను దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్) జనరల్  మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ గురువారం తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట సెక్షన్ వరకు రైల్వే లోకో క్యాబిన్‌లో కూర్చొ ని ప్రయాణించారు.  ట్రాక్, వంతెనలు,  సిగ్నలింగ్ వ్యవస్థల నిర్వహణకు సంబంధించిన భద్రతా అంశాలను పరిశీలించారు. ఎస్‌సీఆర్ పరిధిలోని అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కాజీపేట బైపాస్ లైన్ పనులపై సమీక్ష నిర్వహించారు. వరంగల్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి  పనులను కూడా జీఎం పర్యవేక్షించారు.

కాజీపేటకు ప్రాధాన్యం

దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట ప్రధాన జంక్షన్ స్టేషన్. ఈ జంక్షన్  సికింద్రాబాద్ న్యూఢిల్లీ, చెన్నై  సికింద్రాబాద్‌ోౌ- హౌరా మధ్య రైలు మార్గాలను కలుపుతుంది. ఈ జంక్షన్ సంవత్సరాల తరబడి రైళ్ల రాకపోకలలో స్థిరమైన వృద్ధి నమోదు చేసుకుం టోంది. దీంతో ఈస్టేషన్‌పై విపరీతమైన  ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే కాజీపేట జంక్షన్‌లో రైళ్ల కదలికలను మరింతగా సులభతరం చేయడానికి బైపాస్ లైన్‌కు అధికా రులు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.125 కోట్లతో 21.47 కిలోమీటర్ల నిడివితో ఈ బైపాస్ లైన్‌ను నిర్మిస్తున్నారు.