డాక్టర్ కేఎస్ రావుకు సృజన్ శిఖర్ పురస్కారం
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం లభించింది. వారణాసికి చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ నాందీ సేవా న్యాస్ సమితి ప్రతియేటా ప్రముఖ సాహితీవేత్తలను ఈ పురస్కారంతో సన్మానిస్తోంది. భార తీయ భాషా సాహిత్యాల అభివృద్ధికి చేస్తున్న కృషికి, జాతీయ స్థాయిలో నిరంతర సాహితీ సేవకు గుర్తింపుగా డాక్టర్ కే శ్రీనివాసరావుకు ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు నాందీ సేవా న్యాస్ సమితి పేర్కొంది. వారణాసిలో బుధవారం జరిగిన సుప్రసిద్ధ హిం దీ సాహితీవేత్త రాజేంద్రప్రసాద్ పాండే స్మారక సాహిత్య కార్యక్రమంలో కేఎస్ రావు కు పురస్కారం ప్రదానం చేశారు. లక్ష రూపాయల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు రాధావల్లభ్ త్రిపాఠి, ప్రొఫెసర్ ప్రభాకర్‌సింహ్ పాండే, శశికళాపాండే పాల్గొన్నారు.




