28 August, 2026 | 10:55 AM

మేయర్, కార్పొరేటర్లతో జీఎం సమిక్షా సమావేశం

28-08-2026 01:02 AM

- సమస్యలను ఏకరువు పెట్టిన కార్పొరేటర్లు

నస్పూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం కోల్ బెల్ట్ ప్రాంతంలోని సమస్యలపై సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ మంచిర్యాల కార్పోరేషన్ మేయర్, కమీషనర్, కార్పోరేటర్లతో జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురు వారం సమీక్షా సమవేశం నిర్వహించారు. డివిజన్ల వారీగా వివిధ సమస్యలను కార్పోరేటర్లు మేయర్ సమక్షంలో జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, వాటర్, స్ట్రీట్ లైట్లు ఇతర మౌళిక వసతులను కల్పించాలని జీఎంని కోరారు. ఆర్&ఆర్ కాలనీలో చేపట్టాల్సిన అంశాలను లేవనెత్తారు. సమస్యలను త్వరగా పూర్తిచేస్తామని జీఎం హామీ ఇచ్చారు. తమ పరిధిలో ఉన్న పనులు వెంటనే పూర్తిచేస్తాం, కార్పోరేట్ స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సిన వాటితో పాటు ప్రభుత్వశాఖల నుంచి అనుమతులు పొందాల్సిన వాటిని ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తామన్నారు.

ఈ సమిక్షా సమావేశంలో మంచిర్యాల కార్పోరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, ఎస్ఓటూ జీఎం కృష్ణప్రసాద్, డీజీఎం(పర్సనల్) అనిల్ కుమార్, ఏజీఎం(సివిల్) ఆనంద్ కుమార్, ఏరియా ఇంజనీర్ సురేష్,  డీజీఎం(వర్క్షాప్) కృష్ణారెడ్డి, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి, సీనియర్ పీఓ ప్రశాంత్, 2వ డివిజన్ కార్పోరేటర్ యశోద, 7వ డివిజన్ కార్పోరేటర్ ఏల్పుల రవీందర్, 24వ డివిజన్ కార్పోరేటర్ బొడ్డు స్వప్న తిరుపతి, 25వ డివిజన్ కార్పోరేటర్ తోట రజిత శ్రీనివాస్, 29వ డివిజన్ కార్పోరేటర్ బండారి సుధాకర్, 31వ డివిజన్ కార్పోరేటర్ తాళ్ల సంపత్, 34వ డివిజన్ కార్పోరేటర్ అగ్గు సాగర్, మున్సిపల్ అధికారులు, శ్రీరాంపూర్ ఏరియా ఇతర అధికారులు పాల్గొన్నారు.