కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
17-02-2025 01:36 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ భారత రాష్ట్ర సమితి(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా BRS నాయకులు, పార్టీ కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేసీఆర్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.




