22 June, 2026 | 6:08 PM

ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దు

22-06-2026 04:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు సంబంధిత అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు కిషోర్ కుమార్ తో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.

అక్రమాలపై ఫిర్యాదు

నిర్మల్ పట్టణంలోని కట్ట ఎఫ్ఎసిఎస్ కార్యాలయం పక్కన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని వాటిని వెంటనే సంరక్షించాలని టిఆర్ఎస్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను ప్రభుత్వం కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ వో రమేష్ రాథోడ్ అధికారులు ఉన్నారు.