13 June, 2026 | 1:48 PM

Breaking News

ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •   శ్రీ వాసవి మాత దేవాలయం లో ప్రత్యేక పూజలు   •  

లోక కళ్యాణం కోసం గోదావరి పరిక్రమ యాత్ర

15-12-2025 07:10 PM

మంథని (విజయక్రాంతి): గోదావరి పరిక్రమ యాత్ర శ్రీ రాజేంద్ర దాస్ మహారాజ్ బృందావన్ మాలూక్ పీఠాధిపతి ఆధ్వర్యంలో 500 మంది పీఠాధిపతులతో నాసిక్ నుండి బయలుదేరి మంచిర్యాల జిల్లా నుండి బీజాపూర్, చత్తీస్గడ్ మీదుగా భద్రాచలం కొవ్వూరు మీదుగా కాలేశ్వరంలో ఆదివారం రాత్రి బస చేసి సోమవారం త్రివేణి సంగమంలో స్నానాధి కార్యక్రమాలు ముగించుకుని కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని, మంథని మీదుగా ధర్మపురి వెళ్లే వారి యాత్రలో మంథనిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వారిని సవినయంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా అయోధ్య వారణాసి తదితర పీఠాధిపతులందరూ కూడా ఇక్కడ పాదం మోపడం జరిగింది. 

వాళ్లందరికీ కూడా పండ్లు అందించి, వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున హిందూ బంధువులందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొని, విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంథని ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, బోట్ల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బత్తుల సత్యనారాయణ పర్యవేక్షణలో గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కెక్కెర్ల అనిల్, ప్రచారక్ తూర్పాటి రాము, సత్సంగ ప్రముక రాజమౌళి గౌడ్, కొమురవెల్లి, హరీష్ గుండా శ్రీనివాస్, బొడ్డు వెంకటేష్, నూక శ్రీనివాస్, మాచిడి శ్రీధర్, కజ్జం శ్యామ్, కొమురవెల్లి సత్యనారాయణ, బొడ్డు సంపత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాతృశక్తి ప్రముఖ్ రావికంటి రేణుక, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.