calender_icon.png 15 December, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిఐటియు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

15-12-2025 07:05:51 PM

జిల్లా కమిటీ సభ్యుడు జిట్టా నగేష్.

చిట్యాల (విజయక్రాంతి): విశాఖపట్నంలో జరిగే సిఐటియు జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ వివిధ సంఘాలలో పని చేసే కార్మికులకు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరిగే సిఐటియు జాతీయ మహాసభల సందర్భంగా చిట్యాలలో సోమవారం ఏర్పాటు చేసిన సంఘం జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల ఇండ్ల మీద సిఐటియు జెండాలను ఎగురవేయడానికి సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారు జెండాలను ఆవిష్కరించినట్లు తెలిపారు.

దేశ స్వతంత్రనికి పూర్వం నుండి కార్మికులు ఎన్నో రకాల పోరాటాలు చేసి, సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి మోడీ సర్కారు కాలరాసి, ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటల పని దినాల విధానాన్ని అమలు చేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొంత మంది సిఐటియు నాయకుల ఇండ్ల మీద జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల లక్ష్మయ్య, మండల నాయకులు రుద్రవరం నర్సింహా, మిల్లు డైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏళ్ల మారయ్య, గోధుమ గఢ్డ వెంకట్ రెడ్డి, ఆటో డ్రైవర్లు అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జిట్ట స్వామి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పోకల ముత్తయ్య, మీసాల కిషన్, మల్లేశం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.