5 August, 2026 | 10:40 AM

అల్ఫోర్స్‌లో ముందస్తు గోకులాష్టమి వేడుకలు

23-08-2024 04:57 PM

కరీంనగర్ సిటీ ఆగస్టు23, (విజయక్రాంతి): శ్రీకృష్ణుడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని, తల్లి ప్రేమకు గొప్ప నిర్వచనమని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్ పాఠశాలలో, అల్ఫోర్స్ టైటిటాట్స్ పాఠశాలలో భగత్నగర్లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా నిర్వహించినటువంటి గోకుల్ ఉత్సవ్ వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైయ్యారు. ప్రారంభానికి ముందు ఆయన్ ప్రాంగణాలలో ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణుని విగ్రహానికి వేదమంత్రాల మధ్య సాంప్రదాయంగా పూజాకైంకర్యాలను నిర్వహించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావంతో మెదలాలని, పలు పూజా కార్యక్రమాలను విధిగా చేపట్టి భగవంతునికి అనుసంధానం చేసుకొని ఆయుషు పెంపొందించుకోవాలని  చెప్పారు. ప్రతి ఒక్కరు పరమాత్ముడైన శ్రీకృష్ణుని భోదనలను శ్రీకృష్ణుడు  అర్జునుల మధ్య జరిగిన సంభాషణ తెలుపబడిన భగవద్గీతను ప్రతి ఒక్కరు పఠించాలని  చెప్పారు. శ్రీకృష్ణుడు ఉద్భవించినటువంటి శ్రీకృష్ణాష్టమిని మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో అట్టహాసంగా వేడుకకగా కోలాహాలం మధ్య ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ ఉత్సాహానికి ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తున్న శ్రీకృష్ణాష్టమి అత్యంత భక్తిశ్రద్దలతో కుటుంభసభ్యులతో ఆనందోత్సవాల మధ్య నిర్వహిస్తారని చెప్పారు.

శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో స్వామి వారికి ప్రీతి పాత్రమైన బృందావనంలో ఆకాశమే హద్దుగా విధ్యుత్కాంతుల మధ్య వివిధ రకాల పుష్పాలతో, పంచామృతాలతో, పండ్లతో, సుగంధద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తారని చెప్పారు. విద్యార్థుల్లో భక్తిభావాలను పెంపొందించడానికై మరియు చారిత్రాత్మకమైన శ్రీకృష్ణుని చరిత్ర తెలియజేయానికై పాఠశాలలో నేడు ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం జరిగినదని ప్రత్యేకంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన పలు నైవేధ్యాలను సమర్పించారు. సుమారు 350 మంది విద్యార్థులు శ్రీకృష్ణుని గోపికల వేషాధారణలతో విచ్చేసి పండుగ వాతవర్ణాని రెట్టింపు చేశారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి నందగోపాల ఓ నందగోపాల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఉట్టి కార్యక్రమం కార్యక్రమానికి వన్నె తేవడమే కాకుండా ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు,  విద్యార్థులు పాల్గొన్నారు.