కరీంనగర్ కమిషనర్‌ను కలిసిన టీఎన్జీవోలు
కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ కార్పొరేషన్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్పయ్ నీ టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆమె ఛాంబర్ లో మర్యాదపూర్వక కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి కమిషనర్ కు వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన నాయకులను పరిచయం చేశారు. అదే విధంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తమరి వద్దకు తీసుకవస్తామని కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగ స్పందిస్తూ తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, ప్రభాకర్ రెడ్డి , తహసిల్దార్ కాళిచరణ్ అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మేందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి నేరెళ్ల కిషన్, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, నాయకులు రమేష్ గౌడ్ రాజేశ్వరరావు సునీత శైలజ జలాలుద్దీన్ అక్బర్ కరుణాకర్ అరసవెల్లి రాజేశ్వరరావు అజ్గర్ అలీ బైరి శ్రీనివాస్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి శంకర్ , డైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటయ్య , ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.






