26 August, 2026 | 1:28 PM

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే రూ.3,220 తగ్గింది!

12-06-2026 12:56 AM
  1. 10 గ్రాముల బంగారం ధర 1.45 లక్షలు
  2. ఒక్కరోజులోనే తగ్గిన 3,200

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాల కారణంగా దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు బుధవా రం మార్కెట్లో అత్యధికంగా పలికాయి. గురువారం నాటి మార్కెట్ వివరాలు చూస్తే పసి డి ప్రేమికులకు పెద్ద ఊరట లభించింది. బుధవారం నాటి ధరలతో పోలిస్తే గురువా రం బంగారం ధరలు క్షీణించాయి. 24 క్యారె ట్ల బంగారంపై ఏకంగా 3,220 రూపాయల మేర తగ్గి రూ. 1,45,640గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 2,950 రూపాయల వరకు తగ్గి రూ. 1,33,500కు చేరింది. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు.

తాజా బంగారం, వెండి ధరల కోసం బిజినెస్ వార్తలు చూడండి

బుధవారం నాటి ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 1,48,860 రూపాయలుగా నమోదైంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యా రెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,36, 450 రూపాయల వద్ద ముగిసింది. బుధవారం మార్కెట్లో కిలో వెండి ధర 2,60, 000 రూపాయలుగా పలికింది. స్థాని క జ్యువెలరీ దుకాణాల్లో కొనుగోలు చేసే సమయంలో వీటికి అదనంగా జీఎస్టీ, మేకిం గ్ చార్జీలు వర్తిస్తాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

మరిన్ని మార్కెట్ అప్‌డేట్స్ కోసం తాజా వార్తలు ఫాలో అవ్వండి


మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా పెట్టుబడిదారులు నష్టభయానికి దూరంగా ఉంటున్నారు. అనిశ్చితి సమయాల్లో తమవద్ద నగదు నిల్వలు ఉండేలా చూసుకోవడా నికి, వారు తమవద్ద ఉన్న బంగారం, వెం డిని అమ్మి నగదును పోగు చేసుకుంటున్నా రు. దీంతో పసిడి ధరలు దిగి వస్తున్నాయని కూడా నిపుణులు పేర్కొంటున్నారు.


పూర్తి అప్‌డేట్స్ కోసం Vijayakranthi News సందర్శించండి.

FAQ's

Q1: బంగారం ధర ఎందుకు తగ్గింది?

 అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల విక్రయాలు కారణం.

Q2: 24 క్యారెట్ల బంగారం ధర ఎంత?

 రూ. 1,45,640 (10 గ్రాములు).

Q3: 22 క్యారెట్ల ధర ఎంత?

 రూ. 1,33,500 (10 గ్రాములు).

Q4: వెండి ధర మారిందా?

 లేదు, వెండి ధరలో మార్పు లేదు.