రూ.11 వేల కోట్లతో జెప్టో ఐపీవో
ముంబై, జూన్ 11 : ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో పబ్లిక్ ఇష్యూకి సిద్ధమైంది. రూ.11 వేల కోట్ల సమీకరించడమే లక్ష్యంగా ప్రాథమిక ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పిం చింది. ఐపీఓలో తాజా షేర్ల జారీ ద్వారా రూ.8,010 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రస్తుత వాటాదార్లు 11.35 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. సంస్థ వ్యవ స్థాపకులు ఆదిత్ పలిచా, కైవల్య ఓహ్ర తమ షేర్లను విక్రయించడం లేదు.
మొత్తం ప్రమోట ర్లకు 18.47 శాతం వాటాలున్నాయి. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ సంస్థలలో ఒకటిగా ఉన్న జెప్టో 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.22,623.58 కోట్ల నికర ఆదాయాన్ని , రూ.24,815.54 కోట్ల నికర ఆదాయ విలువను నమోదు చేసిం ది.
2026 ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,635.73 కోట్లుగా ఉంది.2025-26లో ఈ సంస్థ 4.79 కోట్ల మందికి 64 కోట్లకు పైగా ఆర్చర్లు అందించింది. తాజా ఇష్యూ ద్వారా వచ్చే నికర ఆదాయాన్ని కొత్త డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయడం, డార్క్ స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి వినియోగించనుంది.






