పత్తి రైతుకు మేలు
ఆదిలాబాద్‌కు పత్తి పరిశోధనా ఉపకేంద్రం
- ఆమోదం తెలిపిన ఐకార్ సంస్థ
- నాణ్యమైన పత్తి ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు
- హర్షం వ్యక్తం చేస్తున్న పత్తి రైతులు
ఆదిలాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఆసియాలోనే ఆదిలాబాద్ జిల్లా పత్తి పంట సాగుకు పెట్టింది పేరు. ఇప్పటికే జిల్లా రైతులు పండించిన పత్తి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నది. తాజాగా జిల్లాకు మంజూరైన పత్తి పరిశోధన ఉపకేంద్రంతో జిల్లా రైతులకు మరింత మేలు చేకూరనుంది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆదిలాబాద్ పత్తికి మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా రెండు పత్తి పరిశోధన ఉపకేంద్రాలను మం జూరు చేస్తూ భారతీయ వ్యవసాయ పరిశోధ నా మండలి (ఐసీఏఆర్) సంస్థ ఇటీవల ఉత్తరులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ లోని పత్తి అధికంగా పండించే ఆదిలాబాద్ జిల్లాకు ఒక ఉప కేంద్రం మంజూరు చేయడం తో జిల్లాలో పత్తి రైతులకు మహర్దశ పట్టనుం ది.
ఆదిలాబాద్‌లో పండించే పత్తి నాణ్యమైనదిగా ఇప్పటికే ఎంతో పేరుగాంచింది. రానున్న రోజుల్లో మరింత నాణ్యతతో కూడిన పత్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా కేంద్రం దృష్టి సారించడంతో జిల్లాకు పత్తి పరిశోధన ఉపకేంద్రాన్ని మంజూరు చేసింది. ఇకపై స్థానికంగానే పత్తి పంట సాగుపై జాతీయస్థాయిలో పరిశోధనలు కొనసాగనున్నాయి.
వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోనే..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే పత్తి పరిశోధన ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచా రం. ఇప్పటికే జిల్లాలో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రం రాష్ర్ట పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతోంది. ఇందులో వివిధ పంటల సాగుపై పరిశోధనలు జరుగుతున్నాయి.
నూతనంగా మంజూరైన పత్తి పరిశోధన ఉపకేంద్రంలో ప్లాంట్ బ్రీడింగ్, ఎంటమాలోజీ, అగ్రనామి డిపార్ట్‌మెంట్లు ఏర్పాట య్యే అవకాశం ఉంది. ఈ నూతన సంస్థ ఏర్పాటులో ఉద్యోగాల భర్తీ, ఆర్థిక లావాదేవీలు తదితరాంశాలను కేంద్ర ప్రభుత్వమే చూసుకోనుంది.
వచ్చే ఏడాది నుంచి పరిశోధనలు
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధర్యంలో తెలంగాణ రాష్ర్టం లో 2 పత్తి పరిశోధన కేంద్రాలను మంజూ రు చేయగా, అందులో వరంగల్‌లో ప్రధా న కేంద్రం ఉండగా, ఆదిలాబాద్‌లో ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రా లు వచ్చే సంవత్సరం పత్తి పంట సీజన్ నుంచి పత్తి పరిశోధనలను ప్రారంభించనున్నట్లు సమాచారం. అధిక దిగు బడి, ఎరు వుల సమతుల్యత, తెగుళ్ల నివారణ, చీడపీఢల నివారణ తదితర అంశాల కు ఈ పరిశోధన కేంద్రంలో పరిష్కారం లభించనుంది.






