22 April, 2026 | 4:40 PM

ధూల్‌పేట్‌లో గంజాయి పట్టివేత

09-12-2024 12:26 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8(విజయక్రాంతి): ధూల్‌పేట్ మంగళ్‌హాట్ మటన్ మార్కెట్ ప్రాం తంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ ఆదివారం దాడులు నిర్వహించింది. అల్జీపూర్‌లోని ఓ ఇంట్లో రాజాసింగ్ అనే వ్యక్తి వద్ద 1.23 కిలోల గంజాయి, రాహుల్ సింగ్ అనే మరోవ్యక్తి ఇంట్లో 2.1 కిలోల గంజాయి లభించింది. వారిని అరెస్ట్ చేయగా, రాహుల్‌సింగ్, మానస, విశాల్ సింగ్‌లు పరారీలో ఉన్నట్లు ఎస్టీఎఫ్‌టీంలీడర్ అంజిరెడ్డి తెలిపారు.