సమిష్టి కృషితోనే మంచి ఫలితాలు
16-04-2026 01:15 AM
నిర్మల్, ఏప్రిల్ ౧5 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ ఫలితాలు నిర్మల్ జిల్లా ఘనత సాధించడం సమిష్టి కృషితోనే సాధ్యమైందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం జిల్లా ఇంటర్మీడియ ట్ అధికారి పరశురాం నాయక్ ఆధ్వర్యంలో కళాశా ల ప్రిన్సిపల్ కలెక్టర్‌ను కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమిష్టి కృషి ఎంతో ముఖ్యమన్నారు. ఈ ఫలితాలు అందరి కృషి ఫలితమని, రానున్న రోజుల్లో జిల్లాను విద్యారంగంలో ముందువరుసలో నిలపాలని సూచించారు.






