హైదరాబాదీ సంస్థకు గూగుల్ అవార్డు
- గూగుల్ గ్రోత్ యాక్సిలరేటర్ టెక్టోరో
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన టెక్టోరో సంస్థ ప్రతిష్ఠాత్మకమైన గూగుల్ గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డు సాధించింది. క్లౌడ్ ఉత్పత్తులు, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్లలో అగ్రగామి గా పేరున్న టెక్టోరో కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అధినేత శ్రీధర్ దన్నపనేని ఈ ఏడు అవార్డు గ్రహీతగా నిలిచారు. లండన్‌లోని ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ గ్లోబల్ పార్ట్‌నర్ సమ్మిట్ వేదికగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
గూగుల్ సంస్థ ఈ అవార్డులను తమతో వ్యాపార భాగస్వామ్యం చేసిన కంపెనీలకు 2014 నుంచి ఇస్తోందని ఆయన వివరించారు. ఆండ్రాయిడ్ అడాప్షన్‌ను డ్రైవ్ చేయడం, కృత్తిమ మేధ ఆధారిత ఆండ్రాయిడ్‌కు యూజర్ ఎక్సిపీరియన్స్ దృష్టి కోణంలో మెరుగులు దిద్దడం, ఆండ్రాయిడ్ డాటా సెక్యూరిటీ, తదితర అంశాలలో విశేషమైన కృషి చేయడాన్ని గూగుల్ సంస్థ గుర్తించడంతోనే ఈ అవార్డు సాధించానన్నారు.
ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ డివైజ్‌తో ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్‌లోనే కార్పొరేట్ డాటాతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేయొచ్చని వివరించారు. తెలంగాణ యువత ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి విస్తృతమైన వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోవచ్చన్నారు.






